నడక అనేది చాలా తేలికైన వ్యాయామం. వారానికి కనీసం 7 గంటలు నడిచే మహిళల్లో రొమ్ముక్యాన్సర్ ముప్పు 14% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కీళ్లవాపుతో తలెత్తే నొప్పులు కూడా నడక వల్ల తగ్గుతాయి. నడక వల్ల కండరాలు బలోపేతమవుతాయి. నడకతో రోగనిరోధకశక్తి సైతం పెరుగుతుంది. రోజుకు కనీసం 20 నిమిషాల సేపు నడిచిన వారికి జలుబు, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్ల ముప్పు 43% తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది.