నెల్లూరు జిల్లా కందుకూరులో తొక్కిసలాటలో 8 మంది మృతిచెందడంపై సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడే మోయాల్సిరావడం అత్యంత బాధాకరమని అన్నారు. వ మంది కార్యకర్తల మరణవార్త 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో విషాదం నింపిందని పేర్కొన్నారు. మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు.