టీడీపీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు జనవరి 4, 5, 6 తేదీల్లో కుప్పంలో పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ బుధవారం తెలిపారు. 4న బెంగళూరు నుంచి శాంతిపురం మండలం చెంగుబల్లకు చేరుకుంటారన్నారు. చెంగుబల్ల, 121-పెద్దూరు, కెనమాకులపల్లెల్లో జరిగే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రాత్రి కుప్పం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకుంటారన్నారు. 5, 6 తేదీల్లో రామకుప్పం, కుప్పం, గుడుపల్లెల్లో చేపట్టే కార్యక్రమాల షెడ్యూల్ పూర్తి కాలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa