టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పందించారు. పంత్ ఢిల్లీ నుండి రూర్కీ వస్తున్నాడని, కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా సిటీకి కొద్దిదూరంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నాడని, తెల్లవారుజామున కావడంతో నిద్ర మత్తులో ఉండటం వల్ల కారు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టినట్లు భావిస్తున్నామని డీజీపీ వెల్లడించారు.