న్యాయాధికారుల శిక్షణ నిమిత్తం రాజధాని అమరావతిలోని మంగళగిరి సమీపంలో ఏర్పాటు చేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీ శుక్రవారం ఉదయం 9గంటలకు ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో జ్యుడీషియల్ అకాడమీ ప్యాట్రన్ ఇన్ చీఫ్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ గవర్నర్లు(హైకోర్టు న్యాయమూర్తులు) పాల్గొంటారు. అనంతరం నాగార్జున యునివర్సిటీకి చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆన్‌లైన్ ద్వారా హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు.