మన దేశంలో మహిళల భద్రతపై ప్రజల్లో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేసి భారత్ మహిళలకు సురక్షితం అని తెలిపేందుకు ఓ యువతి ఒంటరిగా 25 వేల కి.మీ సైకిల్ యాత్రను చేపట్టింది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఆరు వేల కి.మీ యాత్రను పూర్తిచేసింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఆశా మాలవీయ నవంబరు 1న భోపాల్ లో ఈ యాత్ర ప్రారంభించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళలో ఈ యాత్ర పూర్తయింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, గోవా సీఎం ప్రమోద్ సావంత్ లను కలిసింది. 'భారత్ మహిళలకు సురక్షితమైన దేశం కాదని విదేశీయులు భావిస్తారు. యాత్ర ద్వారా ఆ ఆలోచనను మార్చాలని ప్రయత్నిస్తున్నా' అని తెలిపింది.