రాష్ట్రంలో ప్రాణవాయువు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని సక్రమంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ - 2021-2022ను ప్రభుత్వం ఆమోదించింది. కరోనా విస్తృతి నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని ప్రకటించింది. హెల్త్ కేర్ సెంటర్స్‌కు విరివిగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు రాష్ట్రంలోనే తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక అనుమతులను వేగవంతం చేయడానికి పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.