మొటిమలు అమ్మాయిలను చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఒంట్లో కొవ్వు నిల్వలు ఎక్కువైతే మొటిమలు వస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. శుభ్రంగా లేకపోయినా, శుభ్రమైన ఆహారాన్ని తినకపోయినా, మలబద్ధకం ఉన్నా, హార్మోనల్ సమస్యలు ఉన్నా, సరిగ్గా నిద్ర లేకపోయినా మొటిమల బారిన పడతారని, అటువంటివారు నీరు ఎక్కువగా తాగుతూ, ఫైబర్ బాగా ఉన్న ఆహారాన్ని తింటే మొటిమల సమస్య తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.