ఛత్తీస్ గఢ్ లోని సారన్ గఢ్ బిలాయిగఢ్ జిల్లా తిమ్రాల్గా గ్రామంలో కారు అదుపు తప్పి నీటిగుంటలో పడిపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారు. గ్రామానికి చెందిన సర్పంచ్ మహేంద్ర పటేల్ తన తల్లిదండ్రులు, భార్య, కూతురు(15)తో సహా కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమ్మాయి మాత్రం త్రుటిలో తప్పించుకుని ఈదుకుంటూ బయపడగలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఓ మృతదేహం వెలికితీశారు. మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు.