వర్క ఫ్రమ్ హోం పేరిట అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు హరియాణా పోలీసులు. ఫరీదాబాద్ కు చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ ప్రకటన చూసి అందులోని వాట్సాప్ నెంబరుకు ఫోన్ చేసింది. దీంతో మోసగాళ్లు ఆమెకు మరిన్ని ఆశలు కల్పించి రిజిస్ట్రేషన్, ఇతర ఫీజుల పేరిట రూ.1,27,000 వసూలు చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీలో కాల్ సెంటరును గుర్తించి ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.