స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎస్ జీ 201 విమానం దాదాపు 30 నిమిషాలు గాల్లోనే తిరిగింది. ముంబయి నుంచి బయలుదేరిన ఈ విమానం యూపీ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్ పోర్టులో గురువారం రాత్రి చేరింది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండ్ చేయడానికి అనుకూల వాతావరణం లేక ల్యాండింగ్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో విమానం దాదాపు అరగంట పాటు గాల్లోనే తిరుగుతూ ఉంది. దీంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. చివరకు విమానాన్ని తిరిగి ముంబయి మళ్లించారు.