ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో ఘోరం జరిగింది. రూపారాం పేటకి చెందిన కవితకు వినోద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో అడ్డుగా ఉన్న కొడుకును చంపేందుకు ప్లాన్ వేసి, ప్రియుడితో కలిసి హతమార్చింది. కొడుకు కనిపించడం లేదని కవిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో అసలు విషయాలు తెలిశాయి. ప్రియుడితో కలిసి పిల్లాడిని చంపేసి, మృతదేహాన్ని ఇంటికి సమీపంలో పాతిపెట్టినట్లు అంగీకరించారు. మృతదేహాన్ని బయటకి తీసి ఆస్పత్రికి తరలించారు పోలీసులు.