బ్రొకోలీని సాధారణంగా ఆహారంలో వినియోగిస్తారు. ఇప్పుడిప్పుడే ఇండియాలో దీని వాడకం పెరుగుతోంది. అయితే దీనిని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్రోకోలీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ను, టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. బ్రొకోలీ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా పెద్ద ప్రేగు లోపల ఏర్పడే అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఎలెర్జిటిక్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక అలెర్జీలు, రోగాల బారిన పడకుండా చేస్తుంది. బ్రొకోలీలో వుండే ఫైబర్ శరీరంలో ఉండే అనవసరపు కొవ్వును కరిగించి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తుంది.