ఏజెన్సీ ప్రాంతానికి గేట్‌వేగా ఉన్న నర్సీపట్నంలో దాదాపుగా రూ.986 కోట్లకు సంబంధించి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పడానికి సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సమస్యలపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం.. ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదని, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన మూడున్నర సంవత్సరాల్లోనే మెడికల్ కాలేజీ నిర్మాణం, తాండవ – ఏలేరు రిజర్వాయర్ల కాల్వల అనుసంధానం, నర్సీపట్నంలో రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు.
నర్సీపట్నంలో రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు, రూ. 470 కోట్లతో తాండవ–ఏలేరు ఎత్తిపోతల పథకం, కాల్వల అనుసంధాన ప్రాజెక్టు, రూ.20 కోట్లతో నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం జోగినాథునిపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.