ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 04:51 PM

‘జగనన్న గురించి ఎవరైనా కార్యకర్తను అడిగితే.. ఆ ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా కాలర్‌ ఎగరేసుకొని ఫలానా వ్యక్తి మా నాయకుడు అని చెప్పుకునే విధంగానే మీ జగనన్న పరిపాలన చేస్తున్నాడు.. మీ జగనన్న బతుకుతాడు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం.. ఇదే మీ జగనన్న ప్రభుత్వం.. ఇదే మనందరి ప్రభుత్వ విధానం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నర్సీపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నర్సీపట్నం గతంలో ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి గురించి సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి ఆలోచించాల్సిందిగా ప్రజలను కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com