ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం రావడంతో ఈ ప్రాంతానికి ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్లు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ అన్నారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. అన్నా ..మీ రాకతో మాకు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉంది. నిజంగా మీరు మూడున్నరేళ్ల తరువాత వచ్చినందుకు మా ప్రాంత ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు సుమారు రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ శంకుస్థాపనతో పాటు రూ.470 కోట్లతో తాండవకు సంబంధించి ఏలేరుకు నీరు అనుసంధానం చేసే కాల్వలు ఏర్పాటు చేయడం, రూ.16 కోట్లతో నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేసారు.