వ్యవస్థలో గొప్ప మార్పులు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజాభీష్టానుసారం అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. తోటపాలెంలో రూ.40 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించిన సచివాలయం భవనాన్ని, రూ.21.80 లక్షల అంచనా విలువతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాలను రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రారంభించారు. అలాగే పొన్నాడ ఆర్&బి రోడ్డు నుంచి బొంతల కోడూరు మీదుగా పాతదిబ్బలపాలెం వరకు రూ.4.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 7.7 కిలోమీటర్ల సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు.