కాజీపేట మండలంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పక్కిరిపల్లె నాగరాజు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన బహిరంగ సభ తొక్కిసలాటలో జరిగిన దుర్ఘటన లో 8 మంది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరణించడం జరిగిందని, ఈ దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం కల్పించాలని, అదేవిధంగా పార్టీ తరపున వారికి ఆర్థిక సహాయం ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం అని ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa