వాల్ నట్స్ లో విటమిన్ ఇ, బి6, మెలటోనిన్, పాలీఫెనాల్స్, థయామిన్ మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే అధిక బరువు, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటికి చెక్ పెట్టవచ్చు. ఇవి వృద్ధాప్యాన్ని నివారిస్తాయి మరియు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌లోని బయోటిన్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వీటిలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాల్ నట్స్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.