ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 12:50 PM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ ప్రజలు శనివారం రాత్రి కొత్త సంవత్సరం సెలెబ్రేషన్స్ లో భాగంగా ఎవరు కూడా రహదారులపై కేక్ కటింగ్ వంటివి చేయకూడదని పెనుకొండ ఎస్ ఐ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ హోటల్స్, దుకాణాలు, వ్యాపారస్తులు నిర్ణిత సమయం లోనే వాటిని మూసివేయాలని, మద్యానికి అనుమతి లేని ప్రదేశాలలో మత్తు పానియలని సేవించిన అందుకు ఏర్పాట్లు చేసిన వారి పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.


ఈ సందర్బంగా రహదారులపై వాహనాల తనిఖీ ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించూట, సైలెన్సుర్ లేని వాహనాలు ఎక్కడ కనిపించిన వాహనాలను సీజ్ చేయటం జరుగుతుందని, అనుమతి లేకుండా డ్యాన్సులు, ఆర్కెస్ట్రా, లాంటి సౌండ్ సిస్టం వాడరాదని, అనవసరంగా యువత మోటార్ వాహనాలపై రాత్రిపూట బయట తిరగరాదని తెలిపారు. కావున ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com