నిరుపేద వెనుకబడిన తరగతుల విద్యార్థులకు 'వెసో'సంస్థ ద్వారా చీరాల పరిసర నియోజకవర్గాల్లో ఉచితంగా విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీసీ కమిషన్ సభ్యుడు అవ్వారు ముసలయ్య చేస్తున్న కృషి ఎంతైనా అభినందనీయమని చీరాల డిఎస్పి శ్రీకాంత్ కొనియాడారు. ముసలయ్య ఇచ్చిన చేయూత కారణంగా ఇప్పటివరకు దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందారని ఆయన పేర్కొన్నారు.
అవ్వారు ముసలయ్య ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత స్టడీ మెటీరియల్ ను డీఎస్పీ శ్రీకాంత్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రత పరిరక్షణలో కీలక పాత్ర పోలీసులదేనన్నారు. అటువంటి పోలీస్ పోటీ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు'వెసో' ఇస్తున్న ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుగా సాగాలన్నారు. ఎన్. ఎన్. సి అకాడమీ అధినేత ఎర్రాకుల శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ అవ్వారు ఆదిలక్ష్మి తదితరులు కూడా పాల్గొన్నారు.