ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి అంకురం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపో తారని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి చదువు తున్న విద్యార్ధులకు బైజూస్ కంటెంట్తో కూడిన అధునాతన టాబ్స్ అందిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మంత్రి జోగి రమేష్ పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ బైజూస్ లెర్నింగ్ యాప్తో ఎనిమిది భాషల్లో, 8 తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందజే యడం జరుగుతుందని ఒక్కో ట్యాబ్ విలువ 16, 500 రూపాయలు, బైజూస్ కంటెంట్ విలువ 15, 500 రూపాయలు కలిపి ఒక్కొక్క ట్యాబ్ విలువ రూ. 32000లు ఉంటుందని మంత్రి వివరించారు. మరోవైపు రానున్న రోజుల్లో ఆరో తరగతి నుంచి 12 వ తరగతి వరకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయ బోతున్నారని విద్యార్థుల బంగారు భవి ష్యత్తు కొరకు ఇంత చిత్తశుద్దితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్ని విద్యార్థులు తల్లి దండ్రులు నిండుమనసుతో ఆశీర్వదించా లని మంత్రి జోగి రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ పరిశీలకులు తన్నీరు నాగేశ్వరావు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.