ఇటీవల దెబ్బతిన్న శనగ రైతును అన్ని విధాలా ఆదుకుంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హామీనిచ్చారు. సింహాద్రిపురం మండలం నంద్యాలంపల్లె గ్రామంలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా రైతుల విన్నపం మేరకు ఆయన శనగ పంటను పరిశీలించారు. అధిక వర్షాల వల్ల శనగ అనుకున్నంత స్థాయిలో దిగుబడి చేతికందే పరిస్థితి కనిపించలేదన్న విషయాన్ని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన ఆయన శనగ పంట వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.