ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ ఇటీవల తన వార్షిక నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను జొమాటో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇందులో పూణె వాసి తేజస్ 2022లో ‘జొమాటో’ యాప్ ద్వారా రూ.28 లక్షల విలువ చేసే ఫుడ్‌ను ఆర్డర్ చేసుకున్నాడట. ‘ఇది ట్విట్టర్ ధర కంటే కేవలం రూ.36,42,17,44,48,38 తక్కువ’ అంటూ జొమాటో సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. మరో వ్యక్తి ఒకే ఆర్డర్లో రూ.25వేలు విలువ చేసే పిజ్జాలను ఆర్డర్ చేశాడట.