2023 మొదటి రోజు నుండి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆహార ధాన్యాలను అందజేస్తుంది. NFSA లబ్ధిదారులకు ఒక సంవత్సరం పాటు ఆహార ధాన్యాలు లభిస్తాయి.జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2023 వరకు పంపిణీ చేయడానికి ఆహార ధాన్యాల సున్నా ధరను ఆహార మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫై చేసింది. 2023 సంవత్సరానికి రూ.2 లక్షల కోట్లకు పైగా ఆహార సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.