ఏపీలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు కిలో రూ.1కే అందిస్తున్న రేషన్ బియ్యాన్ని ఈ ఏడాది కాలం ఉచితంగా అందిచాలని నిర్ణయించింది. ఇటీవలే కేంద్రం దేశంలో ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే కార్డుదారులందరికీ ఏడాదిపాటు ఉచితబియ్యం అందిస్తామని ప్రకటించింది. ఏపీలో ఎన్ఎప్ఎస్ఏ కార్డుదారులతో పాటు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు కూడా ఉచితంగా బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నేటి నుండి అమల్లోకి వస్తుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో 1.46 కోట్ల కార్డుదారులకు లబ్ధిచేరనుంది.