తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీజోన్-1 లో 54 పోస్టులుండగా, మల్టీజోన్-2 లో 59 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 01 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 23న పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ లో తెలిపింది.