కొత్త సంవత్సరం తొలిరోజే ఆయిల్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.25 మేర పెంచాయి. గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.1973 కు చేరింది. విజయవాడలో రూ.1947కు చేరింది. కాగా, ప్రతి నెల ఒకటవ తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.