ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యోగివేమన జయంతిని అధికారికంగా నిర్వహించాలని సచివాలయంలోని వివిధ శాఖలు, ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టరేట్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధానాలను రూపొందించి అన్ని శాఖలకు పంపించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖను ఆదేశించారు.