టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి, ప్రస్తుతం రిషికేష్ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పంత్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనుందని సమాచారం. దీంతో అతడు ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు ఐపీఎల్ కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ పంత్ ఐపీఎల్ కి దూరమైతే ఢిల్లీ సారథ్య బాధ్యతలు డేవిడ్ వార్నర్ చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఢిల్లీ జట్టులో వార్నర్ అంత అనుభవం ఉన్నవారెవరు లేరు. అంతే కాకుండా దాదాపు ఐదూ సీజన్లలో సన్ రైజర్స్ కెప్టెన్ గా వార్నర్ పనిచేశాడు. దీంతో వార్నర్ వైపై ఢిల్లీ జట్టు యజమాన్యం మొగ్గుచూపే అవకాశం ఉంది.