బాలికపై ఆమె పెద్దనాన్నే అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. రాటిబాద్లో నివాసముండే మహిళ, భర్త చనిపోవటంతో ముగ్గురు కుమార్తెలతో అత్తగారింట్లో ఉంటుంది. కాగా, గురువారం రాత్రి తన చిన్న కుమార్తె ఏడుస్తూ ఉండటంతో ఏమైందని అడగ్గా పెద్దనాన్న తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లితో చెప్పిందా బాలిక. తల్లి ఫిర్యాదు మేర కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారిలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.