కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఆహారం కల్తీ అయి వందమంది ఆస్పత్రి పాలయ్యారు. బాప్టిజమ్ సెర్మనీలో వంద మందికి పైగా హాజరయ్యారు. అక్కడ ఆహారం తిన్న వందమంది తీవ్ర అస్వస్థతకు గురవ్వటంతో ఆస్పత్రికి తలలించారు. వివిధ హాస్పిటల్స్లో వారు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. సెర్మనీకి ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థపై పోలీసులు.. 268,272,269 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దర్యాప్తునకు ఆదేశించారు.