గుంటూరు తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మృతుల ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సోమవారం చెప్పారు. కందుకూరు టిడిపి సభలో 8 మంది మరణించిన ఘటన మరువకముందే గుంటూరులో ముగ్గురు చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa