అనేక రాజకీయ, ఆర్థిక సవాళ్లు విజయవంతంగా ఎదుర్కొని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వలోని రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర రీతిలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించిందని వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరంజక పాలనకు మూడున్నరేళ్లు దాటిందన్నారు. 2019మే ఆఖరులో అనేక ప్రజాసంక్షేమ పథకాలతో అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ సర్కారు తన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజల్లో నవచైతన్యాన్ని నింపిందన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నలిగిపోయిన ప్రజలకు చెప్పలేనంత ఊరట కల్పించిందని వివరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడున్నరేళ్ల పరిపాలన పూర్తిచేసుకొని, నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక స్టోరీని పోస్టు చేశారు.