కృష్ణా జిల్లా, పామర్రు మండలం, కొత్త పెద్ద మద్దాలిలో రైతులు ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ పామర్రు - కత్తిపూడి జాతీయ రహదారి పై రైతులు ధర్నా చేపట్టారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా ఆర్‌బికే కేంద్రాల వద్ద ధాన్యం ధర నిర్ణయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.