దురదృష్టకర సంఘటనను రాజకీయాలకు ఆపాదించే వారు మనుషులు కాదని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనను పార్టీలకు అంటగడతారా అంటూ మండిపడ్డారు. జరిగిన సంఘటనపై తమకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. సంఘటన జరిగిన వెంటనే వైసీపీ నాయకుల పరామర్శ, సోషల్ మీడియా యాక్టివ్ కావటం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. మహిళపై అత్యాచారాలు జరిగినప్పుడు మహిళ కమిషన్ మాట్లాడదు..కానీ చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ముందు ఉంటుందని విమర్శించారు. ఏ ఘటన జరిగిన ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లోకేష్ పాదయాత్ర ను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని నక్కా ఆనందబాబు ఆరోపించారు.