ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ మంత్రులపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 02, 2023, 11:28 PM

తెలంగాణ మంత్రులపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనని, ఏపీని ఉద్ధరించడానికి ఏం చేస్తారని అన్నారు. తెలంగాణ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో దొంగ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన ఆస్తులు, నిధులు ఇవ్వడం లేదని మండి పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టడం తప్పు కాదని, ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చని నాని అన్నారు. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారని, బీఆర్‌ఎస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చని చెప్పారు.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com