ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. ఓ 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో తాత వరుసైన ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఆదివారం ఉదయం కూతురి పరిస్థితి గమనించిన తల్లి ఘటనపై ఆరా తీసింది. బాలిక భయపడిపోయి అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వీరఘట్టం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.