మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్కి చెందిన బాలిక (17) చాలాకాలం నుంచి ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇంట్లో వాళ్లకి తెలీయకుండా వీరిద్దరూ ఏకాంతంగా గడిపేవారు. ఈక్రమంలో 2 నెలల క్రితం బాలిక యువకుడితో ఇంట్లో నుంచి పారిపోగా, పోలీసుల సాయంతో బాలికను ఇంటికి రప్పించి మందలించింది ఆమె తల్లి. యువకుడిని కొద్ది రోజులు జైల్లో ఉంచిన పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపించారు. దీంతో కక్ష పెంచుకున్న బాలిక ప్రియుడితో కలిసి తల్లి గొంతు కోసింది. అనంతరం కత్తితో విచక్షణా రహితంగా పొడిచి, కిరాతకంగా చంపేశారు.