ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం ఈ నెల 26వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. నిబంధనల అమలును తనిఖీ చేసేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్ విభాగాలను ఏర్పాటు చేశారు. నగరాలు, పట్టణాలు, పంచాయతీల్లో ఈ బృందాలు తనిఖీలు చేయనున్నాయి.
మరోవైపు ఏపీలో ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ సంచుల తయారీ, వినియోగంపై నిషేధం అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై దేశవ్యాప్తంగా 120 మైక్రాన్లు లేదా ఆపై మందం గల ప్లాస్టిక్ సంచులను మాత్రమే వాడాలి. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగ్ లు తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా, విక్రయించినా, వాడినా కఠిన చర్యలు తీసుకుంటారు.