గుంతకల్లు పట్టణంలోని ప్రధాన రహదారి విస్తారణలో భాగంగా వైఎస్ఆర్ కూడలి నుండి పాత బస్టాండు వరకు నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణాన్ని మంగళవారం బండి శేషన్న క్షేత్ర స్థాయిలో పరిశీలిం చారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండేలా పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ డిఇ హేమచంద్ర కుమార్ ను ఆదేశించారు. ప్రధాన రహదారి అయినందున నిర్మాణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని కమిషనర్ గుత్తేదారును హెచ్చరించారు.