దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతుంది. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 134 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,956కి చేరింది. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,30,707గా ఉంది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.11 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.