కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ఖరారైంది. ఈనెల 8న కర్నూలు, అనంతపురం జిల్లాలో అమిత్ షా పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో ఐదు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 8న ఉదయం 11:15 గంటలకు కర్నూలులో బహిరంగ సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 1:30 గంటకు పార్టీ కార్యకర్తలతో కేంద్రమంత్రి సమావేశం అవుతారు. అలాగే సాయంత్రం 3 గంటలకు పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30గంటలకు శ్రీ సత్యసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఆపై సాయంత్రం 5 గంటలకు పుట్టపర్తిలో పార్టీ కార్యకర్తలతో కేంద్రమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa