బందరుపోర్టు నిర్మాణంలో భాగంగా రోడ్ కం రైలు మార్గానికి 146 ఎకరాల భూమిని ఇప్పటివరకు సేకరించినట్టు కలెక్టర్ రంజిత్‌బాషా తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బందరుపోర్టుకు సంబంధించి భూ సేకరణపై సీఎస్, కలెక్టర్ రంజిత్‌బాషాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బందరుపోర్టు వరకు రోడ్‌కంరైలు మార్గాల కోసం తొలివిడతగా కరగ్రహారం, పోతేపల్లి, గోపువానిపాలెం గ్రామాల్లో 146 ఎకరాల భూమిని గుర్తించినట్టు తెలిపారు. ఇందులో ముడాకు చెందిన భూములు 50.85ఎకరాలు, ప్రైవేట్ పట్టాభూములు 48.65 ఎకరాలు, అసైన్డ్ భూములు 41 ఎకరాలు ఉన్నాయన్నారు. భూసేకణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిపికేషన్ కూడా ఇచ్చామని కలెక్టర్ తెలిపారు.భూమి కోల్పోయిన రైతులతో మాట్లాడి పరిహారం ధరపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మచిలీపట్నం ఫిషింగ్‌హర్బర్ రెండో విడత పనులు 54శాతం మేర పూర్తయ్యాయని, సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో ఏపీ మేరీటైమ్‌బోర్డు ఎండీ విద్యాశంకర్, ముడా వీసీ శివనారాయణరెడ్డి, ఫిషింగ్‌హర్బర్ ఏపీ ప్రాజెక్టు అధికారి రాఘవేంద్రరావు, ఆర్డీవో ఐ కిషోర్, తహాసీల్దార్ డి .సునీల్‌బాబు పాల్గొన్నారు.