జగనన్న స్వచ్ఛ సంకల్పంలోని కార్మికులకు పెండింగ్ లో ఉన్న పది నెలల వేతనాలు తక్షణం విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. బుధవారం చేపట్టిన నిరసన దీక్షలో ఏఐటియుసి నాయకుడు బాదుల్లా మాట్లాడుతూ ఈనెల 4, 5, 6, 7 తేదీలలో నిరసన దీక్షలలో భాగంగా బుధవారం నుంచి దీక్షలు ప్రారంభించామన్నారు. సర్పంచులతో సంబంధం లేకుండా జీతాలు చెల్లించాలన్నారు. యూనిఫామ్, చెప్పులు, గ్లోజులు, కొబ్బరి నూనె, మాస్కులు అందించాలన్నారు. జీవో నెంబర్ 680 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ. 6 వేలు నుంచి రూ. 10 వేలు పెంచి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు స్వచ్ఛభారత్ కార్మికులు పాల్గొన్నారు.