కాంగ్రెస్ నేత సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. అయితే, రెగ్యులర్ చెకప్ కోసమే ఆమె ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. వైద్యులు సోనియాకు పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, గతంలో అస్వస్థతకు గురైన సోనియా కొన్ని రోజులు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటున్నారు.