అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ కు మంగళవారం రాత్రి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. సదరు ట్రాన్స్ జెండర్ ఇటీవల వరకూ మిస్సోరి జైలులో ఉన్నారు. గవర్నర్ మైక్ పార్సన్.. ట్రాన్స్ జెండర్ క్షమాపణ అభ్యర్థనను తిరస్కరంచడంతో మరణశిక్షను అమలు చేశారు. ఓ యువతిని హతమార్చి నదిలో పడేసిన కేసులో ట్రాన్స్ జెండర్ కు కోర్టు 2016లో మరణశిక్ష విధించింది. 2021లో ఫెడరల్ కోర్టు సైతం దీన్ని సమర్థించింది.