ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ కడుపులో టవల్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 07:41 PM

డాక్టర్లు ఓ గర్భిణికి డెలివరీ ఆపరేషన్ చేసి ఆమె కడుపులో టవల్ వదిలేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. నజ్రానా అనే మహిళ పురుటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ మత్లూబ్, సిబ్బంది ఆ మహిళకు డెలివరీ చేశారు. అయితే ఆపరేషన్ చేసిన సమయంలో ఆ మహిళ కడుపులో టవల్ మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో నజ్రానాకు కడుపులో నొప్పి వచ్చింది. కడుపునొప్పి ఎక్కువగా ఉందని డాక్టర్ ను సంప్రదించగా, చలి ఎక్కువగా ఉండటంతో అలా జరిగిందని చెప్పాడు. అయితే కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఆమెను మరో ఆస్పత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు ఆమెకు మళ్లీ ఆపరేషన్ చేసి కడుపులోని టవల్ ను బయటకు తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com