విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ బుధవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఎలాంటి విభేధాలున్నా పక్కన పెట్టాలని, ఏమైనా సమస్యలుంటే మనలో మనం సర్దుబాటు చేసుకుందాం అని పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పోటీ చేస్తారని సీఎం జగన్ ప్రకటించారు. ఈసారి 175 సీట్లు గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం అని సీఎం జగన్ అన్నారు.