పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం రామలింగయ్య పల్లె గ్రామంలో బుధవారం రాత్రి కొందరు గుర్తుతెలియని దండగలు కంది పంటకు నిప్పు పెట్టారు. దీంతో సుమారు లక్ష 50 వేల రూపాయల కంది పంట కాలి బూడిదయింది. కంది పంట గ్రామ వాలంటీర్ గోవిందుకు చెందిందని, ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని కంది పంటను పండించారని గ్రామస్తులు తెలిపారు. గోవిందు మాట్లాడుతూ తాను పొలాన్ని కౌలుకు తీసుకొని సంవత్సరం పాటు కష్టించి పంట పండించానని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కంది పంట సర్వం నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గోవిందును సిపిఐ నాయకులు నబి రసూల్, ఎంపీటీసీ లలితమ్మ, తిమ్మారెడ్డి, నాగిరెడ్డిలు పరామర్శించారు.